బనకచర్లను ఒప్పుకోం ... రాయలసీమను ఆపాల్సిందే : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
జలవనరుల శాఖ నుంచి కోర్టు వరకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ రాయలసీమ
ప్రాజెక్టులు, బనకచర్ల
ప్రాజెక్టు అడ్డుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 7 మండలాలను ఏపీకి కట్ట
బెట్టడం అన్యాయమన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది
లేదని,
తెలంగాణ
సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి, వరద జలాల్లో మన హక్కు తేలిన
తర్వాతే కింది రాష్ట్రాలు ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తామన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు
అందించేందుకు రూ. 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తి పోతల పథకానికి ఉమ్మడి ఖమ్మం
జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస
రెడ్డి,
ఖమ్మం
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్ట రాగమయిలతో కలిసి
శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం
జిల్లాలోని ప్రతి ఎకరానికి కృష్ణ, గోదావరి జలాలను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
నాగార్జున సాగర్ 3వ
జోన్లో ఉన్న ఆయకట్టుకు రెండవ జోన్ నుంచి సాగు నీరు అందించాలని ఈ ప్రాంత ప్రజలు
కొన్ని దశాబ్దాలుగా పాలకులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశారని అన్నారు. కానీ మధిర
ప్రాంతంలో కట్టలేరు, వైరా, మున్నెరు నదులు
ప్రవహిస్తున్నా నీరు మనకు అందలేదని పేర్కొన్నారు. 2012లో జవహర్ ఎత్తి పోతల పథకానికి
ప్రతిపాదనలు పంపిస్తే, గత పాలకులు10 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రజా
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దృష్టికి ఈ ప్రాజెక్టు తీసుకుని వచ్చి, సర్వే నిర్వహించి, నిధులు మంజూరు చేయడం
జరిగిందన్నారు. ప్రస్తుతం కట్టలేరు ప్రాజెక్టు ఆధునికరణ పనులు కూడా పూర్తి చేశామని
చెప్పారు. మధిర ప్రాంతంలో అధికంగా వ్యవసాయంపై ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, నీటిని సద్వినియోగం
చేసుకుంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చిరకాలం గుర్తుండే అద్భుతమైన
ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం
తెలిపారు. పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారానే పంటలు
పండుతున్నాయని అన్నారు. ప్రతి రోజూ11 టీఎంసీల నీరు
ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా పనులు చేస్తుందని, ఈ దోపిడి ఇలాగే కొనసాగితే 20 రోజులలో శ్రీశైలం
ఖాళీ అవుతుందని, నాగార్జునసాగర్
చివరి ఆయకట్టు సాగు నీరు అందేలా పోరాటాలు కొనసాగించాలని అన్నారు.
గత పాలకులు మోసం చేశారు : వాకాటి శ్రీహరి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ గత పది
సంవత్సరాల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను గత పాలకులు మోసం చేశారని విమర్శించారు.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నియోజక వర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిందని, వరి పండించిన రైతులకు
గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించిందని గుర్తు చేశారు. మరే
రాష్ట్రంలో లేని విధంగా మన రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని బియ్యంగా మార్చి
పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వైద్య, విద్యా, వ్యవసాయ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు
ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో
పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు బలోపేతం చేయాలని ఆయన కోరారు.
గేమ్ చేంజర్ గా జవహర్ ఎత్తిపోతల పథకం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మధిర ప్రాంతానికి
గేమ్ చేంజర్ గా జవహర్ ఎత్తిపోతల పథకం మారుతుందని అన్నారు. రో. 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులను సంవత్సరం
లోపు పూర్తి చేయాలని ఆయన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జవహర్
ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, వైరా నదిలో120 రోజుల్లో 4 టీఎంసీలు ఎత్తి పోసెలా ఈ ప్రాజెక్టు రూప కల్పన చేశామన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 190 ఎకరాల భూ సేకరణ చేయాల్సి వుందని, దీని కోసం ప్రత్యేకంగా
రూ. 45 కోట్లు కేటాయించినట్లు
తెలిపారు. దీని వల్ల మధిర మండలంలో 13 వేల ఎకరాల, ఎర్రుపాలెం మండలంలో 19 వేల ఎకరాల ఆయకట్టు
స్థిరీకరణ జరుగుతుందన్నారు. గత పాలకులు చేసిన అస్తవ్యస్త పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక
వ్యవస్థ చితికి పోయిందని, అటువంటి సమయంలో ఆర్థిక శాఖ, విద్యుత్ మంత్రిగా బాధ్యతలు
తీసుకున్న డిప్యూటీ సీఎం అద్భుతంగా పని చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను
గాడిలో పెడుతూ పేదల సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. అదే సమయంలో
పేదలకు 200 యూనిట్ల ఉచిత
విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రసంశించారు. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తుందని, గోదావరి నది బోర్డు
నుంచి సిడబ్ల్యుసి వరకు ప్రతి దశలో ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పారు. కాళేశ్వరం
ప్రాజెక్టులో గత పాలకులు చేసిన అవినీతి కారణంగానే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని కమిషన్
రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల పూర్తి చేస్తాం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను
పూర్తి చేస్తామన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. భూ
భారతితో పేద రైతులకు న్యాయం చేశామన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం
ఇస్తున్నామన్నారు. రూ.1200 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
జోన్ 3 ఆయకట్టు జోన్ 2 పరిధిలోకి : పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జోన్ 3లో ఉన్న బ్రాంచి కేనాల్ మీద మధిర, ఎర్రుపాలెంలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా నీరు సరిగ్గా అందక రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఇప్పుడు 630 కోట్ల 30 లక్షల రూపాయలను ఖర్చు చేసి జవహర్ ఎత్తిపోతల పథకం నిర్మించడం వల్ల ఆంధ్రతో సంబంధం లేకుండా జోన్ 3 ఆయకట్టు జోన్ 2 పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. గోదావరి నీటిని పాలేరు తీసుకొచ్చి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, ఇర్రిగేషన్ సీఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.







Comments
Post a Comment